పాకిస్తాన్‌లోని అణు గుట్టు రట్టు
- May 18, 2017
ఉపగ్రహ సాయంతో గుర్తింపు
పొరుగుదేశం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్వాలో పీర్ థాన్ పర్వతం దగ్గర్లో రహస్య అణ్వాయుధ నిల్వ కేంద్రం ఉన్నట్లు ఔట్‌లుక్ మేగజీన్ ఓ కథనంలో పేర్కొంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా సేకరించిన సమాచారంతో ఈ విషయం వెలుగుచూసింది. భారత మిలిటరీ నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఈ స్థావరం గురించి కొన్ని రోజుల ముందు వరకు ఎవరికీ తెలీదు. ఇటీవలే పాకిస్తాన్ 2,750 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల షాహీన్–3 క్షిపణిని పరీక్షించడం తెలిసిందే.
ఈ క్షిపణికి అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కూడా ఉంది. రహస్య స్థావరంలో షాహీన్–3 క్షిపణులను రహస్యంగా మోహరించి ఉంచినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ 320 కి.మీ, చండీగఢ్ 520 కి.మీ, న్యూఢిల్లీ 720 కి.మీ దూరంలోనే ఉండటంతో భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. గత కొన్నేళ్లుగా పాక్ ఎన్నో రహస్య అణ్వాయుధ నిల్వ కేంద్రాలను నిర్మించిందనీ, ఉపగ్రహ చిత్రాల ద్వారా వాటిని త్వరలోనే గుర్తిస్తామని ఔట్‌లుక్ తెలిపింది. కాగా, భారత్‌కు 2,600 అణ్వాయుధాలను తయారు చేయగల సామర్థ్యం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









