హారర్‌ సినిమాగ రాబోతున్న రేష్మీగౌతమ్‌ 'అంతకుమించి'

- May 18, 2017 , by Maagulf
హారర్‌ సినిమాగ రాబోతున్న రేష్మీగౌతమ్‌ 'అంతకుమించి'

సతీశ్ జై, రేష్మీగౌతమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'అంతకుమించి'. జానీ దర్శకుడు. సతీశ్ నిర్మాత. హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేష్మీ మాట్లాడుతూ ''ఇందులో నా పాత్ర పేరు మధుప్రియ. ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చెయ్యలేదు. టైటిల్‌కు సరిగ్గా సరిపోయే సినిమా ఇది. కొత్త అంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి'' అని తెలిపింది. ''హారర్‌ థ్రిల్లర్‌ ఇది. హారర్‌లో కొత్త జోనర్‌ చూపిస్తున్నాం. హీరో, హీరోయిన్ లకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

70 శాతం షూటింగ్‌ పూర్తయింది.'' అని దర్శకుడు చెప్పారు. మిగిలిన రెండు పాటల్ని గోవాలో చిత్రీకరిస్తాం. త్వరలో పాటల్ని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం'' అని నిర్మాత చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com