వ్యాట్‌ అమలుకు ఎంపీల అనుమతి!

- May 20, 2017 , by Maagulf
వ్యాట్‌ అమలుకు ఎంపీల అనుమతి!

వాల్యూ యాడెడ్‌ ట్యాక్‌స (వ్యాట్‌) అమలు కోసం ఎంపీల అనుమతి తప్పనిసరి అని ఫైనాన్స్‌ మినిస్టర్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ ఖలీఫా చెప్పారు. జిసిసి వ్యాట్‌ అగ్రిమెంట్‌, జిసిసి యునిఫైడ్‌ ఎగ్రిమెంట్‌ ఆన్‌ సెలక్టివ్‌ ట్యాక్సేషన్‌ వంటి విషయాలపై ఎంపీ ఇసా అల్‌ కూహెజి అడిగిన ప్రశ్నకు మినిస్టర్‌ సమాధానమిచ్చారు. కొత్త ట్యాక్స్‌ని హౌస్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌, అలాగే షురా కౌన్సిల్‌ రివ్యూ చేస్తాయని వివరించారు. రాజ్యాంగ బద్ధమైన, చట్ట బద్ధమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారాయన. బేసిక్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాట్‌ ఉండదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. మంగళవారం జరిగే రెగ్యులర్‌ మీటింగ్‌లో మినిస్టర్‌ సమాధానాలపై హౌస్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌ వేదికగా చర్చ జరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com