కేరళలోని గురువాయుర్ ఆలయానికి బాంబు బెదిరింపు
- May 20, 2017
కేరళలోని ప్రసిద్ధ కృష్ణ మందిరం గురువాయుర్ ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేగాక, ఆలయ నిర్వహణలో అవినీతి జరుగుతోందని సదరు వ్యక్తులు ఫోన్లో చెప్పినట్లు అధికారులు చెప్పారు.
ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్ రికార్డుల వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా ఆలయం వద్ద భద్రతను ఏర్పాటుచేశారు. బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీలు నిర్వహించారు. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో గురువాయుర్ ఆలయం ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







