బహ్రెయిన్‌కి బడ్జెట్ విమానాలు
- October 07, 2015
సౌదీ అరేబియాకి చెందిన బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఫ్లైనాస్, బహ్రెయిన్‌కి బడ్జెట్ విమానాల్ని నడపనుంది. రియాద్ మరియు జెడ్డా నుంచి బహ్రెయిన్‌కి తక్కువ ఖర్చుతో విమాన యానాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఫ్లైనాస్ సంస్థ నిన్న ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి ఈ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. టిక్కెట్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్‌గా, టిక్కెట్ ధరను 299 సౌదీ రియాల్స్ నుంచి (బహ్రెయిన్ దినార్స్ 30) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జెడ్డా నుంచి బహ్రెయిన్‌కి, రియాద్ నుంచి బహ్రెయిన్‌కి వారంలో మూడేసి రోజుల చొప్పున ఫ్లైనాస్ బడ్జెట్ విమాన సేవల్ని అందించనుంది. బహ్రెయిన్‌కి పెరుగుతున్న విమాన ప్రయాణీకుల నేపథ్యంలో, ఆ రంగంలో తమ వాటాను పొందడానికీ, ప్రయాణీకులకు తక్కువ ఖర్చుతో విమానయానాన్ని అందించడానికీ విమాన సర్వీసులు నడపనున్నట్లు ఫ్లైనాస్ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







