అల్లుఅర్జున్ చాల భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారుద్రమదేవి
- October 08, 2015
రేపు విడుదల కాబోతున్న 'రుద్రమదేవి' సినిమాను అల్లుఅర్జున్ చాల భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. వివిధ పత్రికలకు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ 'రుద్రమదేవి' కి భారీ ఓపెనింగ్స్ వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తున్నాడు బన్నీ. తాను నటించిన గోన గన్నారెడ్డి పాత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు 'రుద్రమదేవి' చరిత్రలో కనిపించకపోయినా గుణశేఖర్ చేసిన పరిశోధన తనకు నచ్చడంతో గోన గన్నారెడ్డి పాత్రను చాలామంది తన సన్నిహితులు వద్దు అని సలహాలు ఇచ్చినా ధైర్యంగా ఆ పాత్రను చేసానని బన్నీ చెపుతూ 'రుద్రమదేవి' పై అంచనాలు పెంచుతున్నాడు. ఈ సందర్భంలో 'రుద్రమదేవి' విషయాలతో పాటు 'శ్రీమంతుడు' సినిమా గురించి కూడా మాట్లాడుతూ మహేష్ పై కొన్ని ఆ శక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'శ్రీమంతుడు' విడుదల అయిన తరువాత మహేష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ 'శ్రీమంతుడు' ఘనవిజయం సాధించినా టాలీవుడ్ హీరోలలో ఒక్క రామ్ చరణ్ తప్పించి తనను ఎవరూ వ్యక్తిగతంగా అభిమందించ లేదని చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం పై అల్లుఅర్జున్ మాట్లాడుతూ తనకు ప్రభాస్, రానా లతో ఉన్నంత పరిచయం చనువు మహేష్ తో చాల తక్కువ అవి అంటూ అయినప్పటికీ 'శ్రీమంతుడు' తాను చూసి చాల బాగుంది అంటూ మహేష్ కు సంబంధించిన కొందరు సన్నీహితులతో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడమే కాకుండా ఈవిషయాన్ని మహేష్ కు కూడ చెప్పమని తాను చెప్పిన విషయం గుర్తుకు చేసుకుంటూ బహుశా ఈ విషయాలు మహేష్ వరకు వెళ్ళి ఉండవు అని కామెంట్ చేసాడు బన్నీ. అంతేకాదు మహేష్ ఇంటర్వ్యూలు చదివిన తరువాత తాను వ్యక్తిగతంగా మహెహ్ కు ఫోన్ చేసి అభినందించానని చెపుతూ అభినందనలు తెలియచేయడంలో ఆలస్యం అయినందుకు తాను ఫీల్ అవుతున్న విషయాన్ని కూడ మహేష్ కు తెలియ చేసానని అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు బన్నీ. అల్లుఅర్జున్ కామెంట్స్ విన్న మీడియా ప్రతినిధులు మాత్రం బన్నీలో బాగా మంచి మెట్యూరిటీ బాగా పెరిగింది అని కామెంట్ చేసుకున్నట్లు టాక్..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







