బాహుబలి ఆసియా దేశాల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధం
- October 08, 2015
ఇండియన్ బిగ్గోస్ట్ మోషన్ పిక్చర్ 'బాహుబలి' డొమెస్టిక్ బాక్సాఫీసు వద్ద సృష్టించిన సంచలనం, కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లోనూ ఈ చిత్రం వసూళ్లు కుమ్మేసింది. తాజాగా ఈ చిత్రం ఇతర ఆసియా దేశాల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. బాహుబలి మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి! బాహుబలి చిత్రాన్ని చైనాతో పాటు జపాన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ఈ రెండు దేశాలతో పాటు ఏడు సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన బుసన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఎం.వి.పి ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో నిర్మాత శోభు యార్లగడ్డ డీల్ కుదుర్చుకున్నాడు. 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రాన్ని ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, లవోస్, కాంబోడియా, మయన్మార్, ఈస్ట్ తిమోర్ దేశాల్లో ఎం.వి.పి ఎంటర్టెన్మెంట్స్ వారు విడుదల చేయబోతున్నారు. త్వరలోనే బాహుబలి చిత్రాన్ని లాటిన్ అమెరికా దేశాల్లోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనం. ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి ఈ చిత్రం దాదాపు 650 కోట్లు వసూలు చేసిన అందరినీ ఆశ్చర్య పరిచింది. తాజాగా ఈ చిత్రాన్ని ఇతర దేశాల్లో విడుదల చేయడం ద్వారా కనీసం మరో రూ. 100 కోట్ల వసూలు అవుతాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







