టీడీపీ మహానాడు వేదికగా 8 తీర్మానాలు చేసిన నేతలు
- May 24, 2017
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన మహానాడులో పాల్గొని పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. మొత్తం 8 తీర్మానాలు చేశారు. కార్యకర్తలే పార్టీ బలమన్న చంద్రబాబు.. తన సుదీర్ఘ ప్రసంగంలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తా కొదమసింహంలా పోరాడాలన్నారు. తెలంగాణ టీడీపీ మహానాడు ఘనంగా జరిగింది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్టీ జెండాను ఆవిష్కరించిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ మహానాడును ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమైక్య రాష్ట్రంలో కంటే మహానాడు అద్భుతంగా జరిగిందన్నారు. కార్యకర్తలే తన బలమన్న బాబు టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిందన్నారు. కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.
చంద్రబాబు హయాంలో నిర్మించిన సైబరాబాద్ వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. టీడీపీని పేదల జీవితాల్లో వెలుగు నింపిన పార్టీగా వర్ణించారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమరవీరుల్ని ఆదుకుంటామని, లక్ష ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన సీఎం ఇప్పటివరకూ వాటిని ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలన్నారు. మహానాడు వేదికపై పార్టీ నేతలు మొత్తం ఎనిమిది తీర్మానాలను ఆమోదించారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలతో సహా ఐదు పార్టీ విధానాలపై నేతలు చర్చించారు. పొత్తుల గురించి, టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఆచితూచి ప్రసంగించిన చంద్రబాబు రాబోయే రోజుల్లో కేడర్‌ను బలోపేతం చేసి తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నేతలకు సూచించారు. గ్రామస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి... సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేయాలన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!









