కువైట్ లో కడప వాసి మృతి
- May 24, 2017
ఎడారి దేశంలో అడుగుపెట్టిన ప్రవాసాంధ్రులు.. కంపెనీలు మూత పడడంతో అక్కడే ఉండలేక.. తిరగి రాలేక నానాపాట్లు పడుతున్నారు. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో అక్కడే కన్నుమూశాడు. మరణించే సమయానికి వీసా కూడా లేకపోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత అతడి మృతదేహం స్వదేశానికి వచ్చింది. కడప జిల్లా నగిరిపాడు గ్రామానికి చెందిన పెద్దబుద్ది లక్ష్మీకర్ దశాబ్దానికిపైగా కువైట్లో ఓ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీ రెండేళ్ల క్రితం బ్లాక్ లిస్ట్‌లో పడింది. దీంతో అతడు రోడ్డున పడ్డాడు. ఇటీవలే లక్ష్మీకర్ రెసిడెన్సీ వీసా గడువు కూడా పూర్తయింది. మరోవైపు కొన్ని నెలలుగా అతడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో వీసా రెన్యువల్ చేయించుకోలేక..
కనీసం స్వస్థలానికి రాలేక తీవ్ర మనోవేదనతో అనారోగ్యం పాలయ్యాడు. గత నెల 29న గుండెపోటుతో మరణించాడు. వీసా లేకపోవడం, ఇతర అధికార లాంఛనాలు పూర్తి కావడానికి చాలా సమయం తీసుకోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం తెల్లవారు జామున లక్ష్మీకర్ మృతదేహాన్ని చెన్నైకు పంపారు. ఈ మేరకు కువైట్లోని రాయలసీమ ప్రవాసీ సంక్షేమ మండలి అధ్యక్షుడు దుగ్గి గంగాధర్ తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







