త్వరలో పెళ్లిచేసుకోనున్న జబర్దస్త్ షో హైపర్ ఆది

- May 24, 2017 , by Maagulf
త్వరలో పెళ్లిచేసుకోనున్న జబర్దస్త్ షో హైపర్ ఆది

సీరియల్స్ పోటీను తట్టుకొని టాప్ రేటింగ్ లో దూసుకొని పోతున్న షో జబర్దస్త్ షో... ఈ షో ద్వారా చాలా మంది కామెడియన్స్ గా వెలుగులోకి వస్తున్నారు.. తాజాగా జబర్దస్త్ షో కి మెయిన్ అట్రాక్షన్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే వెంటనే హైపర్ ఆది అని వస్తుంది ఆన్సర్. చిన్న పాత్రతో జబర్దస్త్ షో లో అడుగు పెట్టిన హైపర్ ఆది.. తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ.. అందరినీ ఆకట్టుకొని ఇప్పుడు తనే సొంతం గా స్కిట్స్ చేస్తూ లీడర్ గా టీం ని లీడ్ చేస్తున్నాడు. ఎక్కువగా ఆడవారి మీద, భార్య భర్తల బంధం పై సెటైర్స్ వేసే హైపర్ ఆది త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఆది... ఆ సీరియల్ లో నటిస్తోన్న నటిని చూసి ఇష్టపడ్డాడట.. ఆ నటి కూడా ఆదిని ఇష్టపడి మాట్లాడడంతో ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది అని .. త్వరలో పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com