ధరల పెరుగుదలపై అజ్మన్ వార్నింగ్
- May 25, 2017
అజ్మన్‌లో ఫుడ్ ఔట్లెట్స్, సూపర్ మార్కెట్ ఛెయిన్స్లకు అజ్మన్ అధికారులు ధరల పెరుగుదలపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, ధరలు పెంచి సామాన్యుల్ని ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ&్చరించారు అధికారులు. అజ్మన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ - కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ అండ్ మార్కెట్ కంట్రోల్ డిపార్ట్మెంట్, తాజాగా స్థానిక సూపర్మార్కెట్స్ ఛెయిన్ ప్రతినిథులతో సమావేశమయి, గైడ్ లైన్స్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా, ప్రభుత్వ ఆదేశాలకు తగ్గట్టు నడుచుకుంటామని అన్ని వర్గాలూ ఓ అవగాహనకు వచ్చాయి. ఎడిఇడి కంట్రోల్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టర్ మొహమ్మద్ అల్కుత్బి మాట్లాడుతూ, స్థిరమైన ధరలతో రమదాన్ మాసంలో సామాన్యులకు హ్యాపీనెస్‌ని అందించాలనీ, ధరలను ఇష్టమొచ్చినట్లుగా పెంచి ఇబ్బందులకు గురిచేయరాదని ఆయా సంస్థల ప్రతినిథులకు సూచించారు. తమ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుందనీ, తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







