‘ఆరడుగుల బుల్లెట్’ జూన్ 9న విడుదల

- May 27, 2017 , by Maagulf
‘ఆరడుగుల బుల్లెట్’ జూన్ 9న విడుదల

‘‘కొ న్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అయ్యింది. అయినా సరే, మంచి సినిమా తీశామన్న సంతృప్తి, ఆనందం కలుగుతున్నాయి. అన్ని వర్గాల వారికీ నచ్చే చిత్రమిద’’న్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. నయనతార కథా నాయిక. బి.గోపాల్ దర్శకుడు. తాండ్ర రమేష్ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. శనివారం హైదరాబాద్లో విలేకరులతో గోపీచంద్ మాట్లాడుతూ ‘‘గోపాల్ గారితో కలసి పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. మధ్యలో ఆ అవకాశం వచ్చింది గానీ, కార్యరూపం దాల్చలేదు. ‘ఆరడుగుల బుల్లెట్’తో ఆ కల నెరవేరింది. వక్కంతం వంశీ కథ చెబుతున్నప్పుడే సినిమా చూసేశా. అబ్బూరి రవి మాటలు చక్కగా కుదిరాయి. మణిశర్మగారు మంచి పాటలిచ్చార’’న్నారు. ‘‘ఓ సినిమా తీస్తే ఇంటిల్లిపాదీ చూసేలా ఉండాలి అని రామానాయుడు గారు చెప్పేవారు.
ఆ మాటని తు.చ. తప్పకుండా పాటిస్తూ వస్తున్నా. కుటుంబ బంధాలు, యాక్షన్, హీరోయిజం... ఇలా అన్నీ ఉన్నాయి.
‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ ప్రకటించగానే ‘గోపీచంద్ కటౌట్కి సరిపోయే టైటిల్’ అని చాలామంది మెచ్చుకొన్నార’’న్నారు బి.గోపాల్. ‘‘పీవీపీ సహకారంతో సినిమాని పూర్తి చేయగలిగాం. జూన్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ’’న్నారు నిర్మాత. అబ్బూరి రవి, బాలమురుగన్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com