ఆవు పేడ...గోమూత్ర వాసనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
- May 28, 2017
మనామా: ఆవు పేడ మరియు గోమూత్రం నుండి వచ్చే దుర్వాసనతో మనామలోని స్థానిక నివాసితులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రశాంతంగా ఉండే వారి జీవితాలు ఇలా అశాంతి పాలవడానికి కారణం ఒక ఆవు అంటే ఆశ్చర్యపోక తప్పదు. గత వారం రోజులుగా ఇక్కడ నివాస ప్రాంతంలో ఉండే ఒక రెస్టారెంట్ ముందు కట్టివేయబడి విస్తారంగా పేడను..ధారాళంగా మూత్రాన్ని వెదజల్లుతూ ఈ ప్రాంతాన్ని గొడ్లచావిడిని చేసిందని స్థానికులు వాపోతున్నారు. బంగ్లాదేశీయుడైన రెస్టారెంట్ యజమాని పాలు పితుక్కోవడం మినహా ఆ స్థలాన్ని శుద్ధి చేయడం లేదని...శుభ్రం చేయాలని నివాసితులు పదే పదే కోరుతున్నప్పటికీ ఆ యజమాని ఏమాత్రం స్పందించడం లేదని వారు పేర్కొంటున్నారు. దీనితో ఆ ప్రాంతం దుర్వాసనతో గుప్పుమంటుంది. నిత్యం ఆవుపెదాలను పోగు చేసి ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడంతో, ఆవు మూత్రం ..పేడలు మరియు ఇతర వ్యర్థాలు కలగలిపి ఈ ప్రాంతంలో గబ్బువాసనతో స్థానికుల ముక్కుపుటలు అదిరిపోతున్నాయి. ఆ సమీపంలో నడవడానికి కూడా అనాగ్యకరమైన వాతావరణం నెలకొందని నివాసితులు ఆరోపిస్తున్నారు. మనామాలో బ్లాక్ నంబర్ 302, రహదారి సంఖ్య 213, నివాసితుల ప్రకారం, ఆజ్ హబీబ్, బాంగ్లాదేశ్ రెస్టారెంట్ యజమాని. మొత్తం ఈ ప్రాంతంలో అనారోగ్య పరిస్థితులు కల్గించడంతో భయంకరమైన దుర్వాసన వెదజల్ల బడుతుంది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









