బ్రిటన్‌లో 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు

- May 28, 2017 , by Maagulf
బ్రిటన్‌లో  23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు

బ్రిటన్‌లో మరో మారణహోమం జరుగనుందా? ఈ దేశంలో దాదాపు 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు తిష్టవేసినట్టు ఆ దేశ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో బ్రిటన్ ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటీవలే మాంచెస్టర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో 20 మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. ఈ దాడులతో బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో ఏకంగా 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు అక్కడి నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వారంతా వివిధ రూపాల్లో సంచరిస్తున్నట్లు అంచనా వేశారు. పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే మాంచెస్టర్‌లో సంగీత కార్యక్రమం నిర్వహిస్తుండగా జరిగిన ఉగ్రదాడికి సంబంధించి దక్షిణ మాంచెస్టర్‌లో మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి అధికారులు పలు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com