బ్రిటన్‌లో 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు
- May 28, 2017
బ్రిటన్‌లో మరో మారణహోమం జరుగనుందా? ఈ దేశంలో దాదాపు 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు తిష్టవేసినట్టు ఆ దేశ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో బ్రిటన్ ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటీవలే మాంచెస్టర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో 20 మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. ఈ దాడులతో బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో ఏకంగా 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు అక్కడి నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వారంతా వివిధ రూపాల్లో సంచరిస్తున్నట్లు అంచనా వేశారు. పాప్ సింగర్ అరియానా గ్రాండే మాంచెస్టర్‌లో సంగీత కార్యక్రమం నిర్వహిస్తుండగా జరిగిన ఉగ్రదాడికి సంబంధించి దక్షిణ మాంచెస్టర్‌లో మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి అధికారులు పలు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!









