ప్రముఖ దర్శకుడు దాసరి అంత్యక్రియలు పూర్తి
- May 31, 2017
హైదరాబాద్: దర్శకరత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్ మండలం తోల్కట్ట వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య దాసరి సతీమణి పద్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియల్ని పూర్తిచేశారు.
మంగళవారం రాత్రి దాసరి మరణవార్త తెలుసుకొని తెలుగు చిత్ర పరిశ్రమ కన్నీరు మున్నీరైంది. ఆయనను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం ప్రజల సందర్శనార్థం దాసరి భౌతికకాయాన్ని ఇంటి నుంచి ఫిలింఛాంబర్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి మొయినాబాద్‌లోని దాసరి వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









