పులిహోర ఆవకాయ రెసిపీ
- October 10, 2015
కావలసిన పదార్థాలు : మామిడికాయలు -12, నూనె - ముప్పావు కేజి, కారం - అరకేజి, మెత్తని ఉప్పు - అరకేజి, ఆవపిండి - అరకేజి, ఎండుమిర్చి - 20, శనగపప్పు - పావుకేజి, ఆవాలు - 50 గ్రా., మెంతులు - 1 టీ స్పూను, కరివేపాకు (తడిలేనిది) - 1 కప్పు.
తయారుచేసే విధానం : మామిడికాయలు చెక్కుతీసి చిన్న ముక్కలు తరగాలి. ఊరగాయ కలుపుకోవడానికి 6 గంటల ముందు అరలీటరు నీళ్లని మరిగించి, చల్లారనిచ్చి అందులో ఆవపిండి వేసి ఉంచాలి. దాంట్లో ఉప్పు, కారం బాగా కలిపి, ముక్కలకు పట్టివ్వాలి (కాస్త నూనెకూడా కలుపుకోవచ్చు). అన్నీ బాగా కలిశాక ఒక జాడీకెత్తుకుని 2 రోజులపాటు ఊరనివ్వాలి. మూడోరోజు ఒక పళ్లెంలో చదునుగా ముక్కల్ని సర్ది ఒక రోజంతా ఎండలో ఉంచాలి. నాలుగవ రోజు మూకుడులో నూనె వేసి ఎండు మిర్చి (ముక్కలు), శనగపప్పులు, మెంతులు, ఆవాలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత పోపుని ముక్కలున్న జాడీలో పోసి వెంటనే మూతపెట్టాలి. పోపు చల్లారిన తర్వాత (మూత తీసి) ముక్కల్ని బాగా కలపాలి. ఈ ఆవకాయ పులిహోర మాదిరి సువాసన వేస్తూ చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







