అఖిల్ సూర్యకవచం
- October 10, 2015
అక్కినేని వారసుడు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'అఖిల్'. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తన పేరునే టైటిల్‌గా ఎంచుకున్నారు. అయితే టాలీవుడ్లో 'అఖిల్'గా ఎంట్రీ ఇస్తున్న అఖిల్ కోలీవుడ్‌లో మాత్రం 'సూర్యకవచం'గా రాబోతున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'సూర్యకవచం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'సూర్యకవచం' చిత్రాన్ని తమిళంలో నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించగా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. 'అఖిల్' ఆడియో తెలుగులో ఇప్పటికే విడుదలైన శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ చిత్ర తమిళ ఆడియో వేడుకను చెన్నైలోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







