జీవితం విలువ తెలిసిందంటున్న మనీషా కొయిరాల
- June 04, 2017
జీవిత విలువ ఏమిటో తెలిసిందని అంటోంది ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాల. ఢిల్లీలో స్పెషల్ ఫాల్కే బ్రేవ్ అండ్ బ్యూటిఫుల్ అవార్డు కూడా అందుకున్న ఆమె.. క్రైసిస్ (కష్టాలు) అన్నది జీవిత విలువను కూడా చాటి చెప్పిందని పేర్కొంది. ఈ అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా తీసిన వీడియోను ఆమె తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
2012లో గర్భాశయ క్యాన్సర్‌కు గురైన మనీషా న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చాలాకాలం పాటు చికిత్స పొంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతురాలైంది. ప్రమాదకరమైన క్యాన్సర్‌ను జయించిన నటిగా రికార్డు సృష్టించింది. ఒక క్యాన్సర్ పేషంటుగా ఉన్న తాను దీన్ని ఎలా జయించానో, ప్రజల్లో అవగాహన కలిగిస్తానని మనీషా కొయిరాల గతంలోనే ప్రకటించింది. క్యాన్సర్ రోగులకు అవసరమైన సాయం చేస్తున్నట్టు ఆమె తెలిపింది. మనీషా ఇటీవలే నటించిన డియర్ మాయ చిత్రం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







