కెమెరాలతో మెరుగైన ట్రాఫిక్
- October 10, 2015
అల్ షమాల్ ఎక్స్‌ప్రెస్ వే మీద ప్రయాణించేవారు, ఎంతో క్రమశిక్షణతో తమ వాహనాల్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా అమర్చిన కెమెరా వ్యవస్థ సమర్థవంతగా పనిచేస్తోదని, వాహనదారులు ఈ కెమెరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. 'తలా' ప్రాజెక్ట్‌లో భాగంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కెమెరాలను ఏర్పాటు చేసింది. అతి వేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్ ట్రాక్ డ్రైవింగ్, రైట్ సైడ్ ఓవర్ టేకింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు కెమెరాలు ఏర్పాటు చేశాక బాగా తగ్గాయి. వాహనదారులు క్రమశిక్షణతో వాహనాల్ని నడిపితే ప్రమాదాలు తగ్గుతాయనీ, ప్రమాదాల నివారణ కోసమే కెమెరాలు ఏర్పాటు చేశామనీ, తమ ప్రయోగం సక్సెస్ అవడం ఆనందాన్నిస్తుందని అధికారులు వివరించారు. పూర్తిగా ఉల్లంఘనలు తగ్గిపోనప్పటికీ, చాలావరకు తగ్గడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. వాహనదారులు కూడా కెమెరాల ఏర్పాటు తర్వాత రోడ్లపై ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. వాహనాలన్నీ క్రమశిక్షణతో వెళ్తున్నట్లు, ప్రభుత్వం చర్యలు సమర్థనీయమని అన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







