యునెస్కో ప్రచారంలో సచిన్ టెండూల్కర్
- June 08, 2017
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఐక్య రాజ్య సమతి అనుబంధ సంస్థ యునెస్కో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో సచిన్ పాల్గొననున్నాడు. చిన్నారుల మానసిక, శారీరక పెరుగదల్లో తండ్రులుదే కీలక పాత్ర అనే నినాదంతో యునెస్కో నిర్వహించనున్న ప్రచార, అవగాహన ఉద్యమంలో సచిన్ పాల్గొంటున్నాడు. ఈ నెల 18న ఫాదర్స్ డే సందర్భంగా 'సూపర్ డాడ్స్' పేరుతో యునెస్కో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో సచిన్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు డేవిడ్ బెక్‌హామ్, నోవాక్ జకోవిచ్‌లు కూడా పాల్గొంటున్నారు. వీరితో పాటు బ్రిటీష్ ఫార్ములా వన్ రేస్ డ్రైవర్ లూయిస్ హమ్లింటన్, అకాడమీ అవార్డు గెలుచుకున్న అమెరికా నటుడు మహేర్షల అలీ, ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మాన్ పాల్గొంటున్నారు. వీరితో కలిసి ప్రచార కార్యక్రమాన్ని యునెస్కో నిర్వహించనుంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ 'నా చిన్నతనంలో నా తండ్రి సరైన ప్రేమను, స్వేచ్ఛను, మద్దతును ఇచ్చారు. వాటి ద్వారానే నేను ప్రస్తుతం ఈ విధంగా రూపుదిద్దుకున్నాను' అని తెలిపారు. తండ్రులతో చిన్నారుల సాన్నిత్యం, ముఖ్యంగా వారి తొలి 1000 రోజుల్లో తండ్రుల సాన్నిత్యం వారిపై ఎంతో ప్రభావం చూపుతుందని యునెస్కో ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







