మరింత ముదురుతోన్న ఖతార్ సంక్షోభం
- June 09, 2017
ఖతార్ సంక్షోభం ముదురుతోంది. తాజాగా దుబై ఆ దేశానికి విమాన రాకపోకలను నిషేదించింది. మరోవైపు, టర్కీ తమ మిత్ర దేశం ఖతార్‌కు దళాలను తరలిస్తోంది. ఇదిలావుంటే ఈ సంక్షోభానికి తెరదించే ప్రయత్నాలు మొదలుపెట్టింది కువైట్!
పశ్చిమాసియాలోని ఓ చిన్న దేశం ఖతార్.. వైశాల్యంలో చిన్నదే అయినా బాగా ధనిక దేశం. రెండు రోజుల క్రితం ఉన్నట్టుండి నాలుగు అరబ్ అగ్రదేశాలు ఖతార్‌పై కత్తిదూశాయి. సౌదీ అరేబియా, బహ్రయిన్, ఈజిప్టులు ఖతార్‌తో వ్యాపార, దౌత్య సంబంధాలు ఖటీఫ్ అన్నాయి.
ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణం ఉంది. ఉగ్రవాద సంస్థలకు ఖతార్ ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పొరుగున ఉన్న ఇరాన్‌తో ఖతార్ స్నేహంగా ఉంటోంది. ఇరాన్ బద్ధశతృవు సౌదీ అరేబియాకు ఇది ఏ మాత్రం మింగుడు పడటంలేదు. దాంతో దాదాపు పదేళ్లుగా సౌదీ అరేబియా-ఖతార్ లోపలలోపల కుతకుతలాడుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇటీవల సౌదీ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. తీవ్రవాదంపై పోరాటం చేసేందుకు సున్నీ దేశాల మధ్య ఐక్యత మరింత పెరగాలన్న ఆయన మాటలను సౌదీ అరేబియా వేరేలా అర్థం చేసుకుంది. ఇదే అదనుగా ఖతార్ పై పంజా విసిరింది. రీజనసల్ పాలసీని ఉల్లంఘించటాన్ని కారణంగా చూపిస్తోంది. తీవ్రవాదానికి మద్దతు పలుకుతూ ప్రాంతీయ స్థిరత్వానికి దెబ్బకొడుతోందని ఆరోపిస్తున్నాయి.
షియాసున్నీ విబేధాలు కూడా సౌదీ, యెమెన్, యూఏఈ, ఈజిప్టులు ఖతర్‌తో సంబంధాలను తెంచుకోవడానికి ఒక కారణం. సౌదీ, ఖతార్‌తో సహా చాలా అరబ్ దేశాల్లో సున్నీ పాలకులే ఉన్నారు. రాజరిక పాలన ఉన్న ఈ దేశాల్లో సున్నీ రాజవంశాలు అధికారంలో ఉన్నాయి. ఖతర్‌కు చేరువ కావడం ద్వారా షియా ఆధిక్య ఇరాన్... సున్నీ రాజ్యాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందనేది సౌదీ అరేబియా అనుమానం.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









