అంతరిక్ష గ్రహానికి మన తెలుగమ్మాయి పేరు
- June 09, 2017
బెంగళూరుకు చెందిన పింగళి సాహితికి అరుదైన గుర్తింపు దక్కనుంది. 12వ తరగతి చదువుతున్న ఆ బాలిక పేరును ఓ గ్రహానికి పెట్టాలని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిర్ణయించింది. ఇటీవల అమెరికాలోని లాస్ఏంజెల్స్లో నిర్వహించిన ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేయిర్‌లో మూడు ప్రత్యేక అవార్డులు సాధించడం.. హ్యూస్టన్‌లో ఇంటర్నేషనల్ సస్టెయనబుల్ వరల్డ్ ఇంజినీరింగ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టు నిర్వహించిన ఒలింపియాడ్‌లో ఆ బాలిక బంగారు పతకం గెలుపొందడంతో ఎంఐటీ ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిపై సాహితి మాట్లాడుతూ నగరంలోని చెరువుల పరిరక్షణ, పర్యావరణాన్ని కాపాడటానికి తాను చేసిన ప్రయత్నం విజయం సాధించిందని, ఈ విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలని చెప్పారు. ప్రతి విద్యార్థి చెరువుల పరిరక్షణకు కృషి చేయడంతోపాటు వాటిని దత్తతకు తీసుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







