'రంగస్థలం 1985' సినిమా ఫస్ట్ లుక్

- June 09, 2017 , by Maagulf
'రంగస్థలం 1985' సినిమా ఫస్ట్ లుక్

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామ్ చరణ్ సినిమాకి 'రంగస్థలం 1985' టైటిల్ ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్ఛమైన ప్రేమకథకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారన్నది సినిమా చూస్తే గానీ తెలిసేలా లేదు. అయితే, 'రంగస్థలం' టైటిల్ ఆసక్తిగా ఉంది. ఈ టైటిల్ పై హీరోయిన్ సమంత, మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజులు స్పందించారు. ఈ టైటిల్ తమకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. టైటిల్ పోస్టర్ ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇప్పుడు 'రంగస్థలం 1985 ' పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ అచ్చ తెలుగు టైటిల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టైటిల్ తో దర్శకుడు సుకుమార్ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేశారు. ఇప్పటికే ఒకట్రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న రంగస్థలం.. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని ప్రారంభించనుంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com