న్యూ హిజ్రి ఇయర్‌ సెలవుకి ఫ్రీ కార్‌ పార్కింగ్‌

- October 11, 2015 , by Maagulf
న్యూ హిజ్రి ఇయర్‌ సెలవుకి ఫ్రీ కార్‌ పార్కింగ్‌

రోడ్లు మరియు రవాణా శాఖ హిజ్రి న్యూ ఇయర్‌ సెలవు రోజున చేపట్టే వివిధ కార్యక్రమాల ప్రణాళికను విడుదల చేసింది. దుబాయ్‌ ఎమిరేట్‌లోని అన్ని పార్కింగ్‌ ప్రాంతాల్లో హిజ్రి న్యూ ఇయర్‌ సెలవు రోజున ఛార్జీలు పూర్తిగా ఉచితమని ఆర్‌టిఏ ఎడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ విభాగం మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మోజా అల్‌ మర్రి చెప్పారు. ఫిష్‌ మార్కెట్‌కి దీన్నుంచి మినహాయింపునిచ్చారు. అక్కడ యధాతథంగా పార్కింగ్‌ ఛార్జీలు వసూలు చేయబడతాయి. వాహనాల పరిశీలన, రిజిస్ట్రేషన్‌కి కూడా సెలవు దినం. అయితే అల్‌ ఖాసియాస్‌ క్విక్‌ రిజిస్ట్రేషన్‌ సెంటర్‌ మరియు దుబాయ్‌ మాల్‌ ప్లాటినం రిజిస్ట్రేషన్‌ సెంటర్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com