కార్మికుల శ్రేయస్సే ముఖ్యం-ఖతార్
- October 11, 2015
ఖతార్ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఖతార్ ఛాంబర్ మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్‌తో కలిసి దోహాలో ఓ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల నివాస, పని సౌకర్యాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగినట్లు ఖతార్ ఛాంబర్ వైస్ ఛైర్మన్ మహమ్మద్ బిన్ తువార్ చెప్పారు. దేశంలో 85 శాతం మంది కార్మికులేననీ, వివిధ రంగాల్లో వారు పనిచేస్తున్నారని, దేశం యొక్క స్థిరమైన అభివృద్ధికి వారు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు బిన్ తువార్. కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకోసం వివిధ సంస్థలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రతినిథులు వెల్లడించారు. ఖతార్ అభివృద్ధి వెనుక ఖతార్ చాంబర్ కృషి ఎంతో ఉందని కార్మిక మరియు సోషల్ ఎఫైర్స్ మంత్రి డాక్టర్ అబ్దుల్లా సలేహ్ ముబారక్ అల్ ఖులైఫి చెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







