ఈజిప్టు వీధిలో కొంత భాగానికి మహాత్ముని పేరు పెట్టారు
- October 11, 2015
జోర్డాన్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం అక్కడ భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరు ఉన్న ఒక వీధిని ప్రారంభించారు. ఈజిప్టు ఉద్యమ నాయకుడు సద్జా గ్లౌల్ పేరున్న ఒక వీధిలో కొంత భాగానికి మహా త్ముని పేరు పెట్టారు. 'ఈ వీధికి మహాత్ముని పేరు పెట్టడానికి గల కారణం, ఇది భారత్‌లోనూ, తమ ప్రాంతంలోనూ శాంతి కోసం జరిగిన పోరాటానికి ప్రతీక' అనిఅమ్మాన్ మేయర్ అకేల బెల్ టాగి తెలిపారు. ఈ వీధికి జోరాన్ రాజు సోదరునితో ను, సద్జాగ్లౌల్‌లతోను సంబంధం ఉందని అయన తెలిపారు. సద్జాగ్లౌల్ కూడా గాంధీ ఉద్యమాలు నడిపిన సమయంలోనే ఈజిప్టులో ఉద్యమాలు నడిపారని అన్నారు. కాగా జోరాన్ రాజు ఒకటో అబ్దుల్లా కూడా సామ్రాజ్యవాద పాలన నుంచి తమ దేశానికి విముక్తి కలిగించేందుకు శాంతియుత ఉద్యమం నడిపారని అన్నారు. ఆయన కృషి కార ణంగానే 1946లో తమ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని టాగి తెలిపారు. 'మహాత్మా గాంధీ పేరు మా రాజధాని నడిబొడ్డున ఉండటమే కాక ఆయన మా శాంతియుత పోరాటానికి ప్రతీక అనే ఉద్దే శంతో ఈ వీధికి ఆయన పేరు పెట్టినట్లు తెలిపా రు. అమ్మాన్ నగర మండలి ప్రణబ్ ముఖర్జీకి బంగారపు తాళం చెవి ఇచ్చి సత్కరించింది. ఇది అమ్మాన్, ఢిల్లీల మధ్యే కాక ఉభయ దేశాల ప్రజల మధ్య అనుబంధానికి ఒక గుర్తు అని టాగి చెప్పారు. భారత్‌తో సంబంధాలకు జోర్డాన్ ఇస్తున్న ప్రాధాన్యం తనకు ఎంతో సంతృప్తి కలిగిస్తోందని రాష్ట్రపతి ప్రశంసించారు. ఈ వీధి పేరు ఉభయ దేశాల స్వాతంత్య్ర పోరాటాలను అనుసంధానం చేస్తుందనడం సబబని ఆయన అన్నారు. అక్కడి శాంతివనంలో ప్రణబ్ ముఖర్జీ శాాంతికి చిహ్నమైన ఆలివ్ మొక్కను నాటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







