కార్మికులకు బకాయి పడిన వేతనాలు త్వరలో చెల్లించబడతాయి
- June 11, 2017
బహ్రెయిన్ లో నిర్మాణ సంస్థ కార్మికులకు బకాయి పడిన వేతనాలను చెల్లించాలనే ఒప్పందం త్వరలో కుదుర్చుకుందని కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి జమీల్ హుమాయిదాన్ వెల్లడించారు. కార్మికుల వేతన బకాయిలను తక్షణమే ఇచ్చేందుకు ప్రధానమంత్రి హెచ్ ఆర్ హెచ్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఆదేశాలను అనుసరిస్తున్నారు. " శ్రీశ్రీ ప్రిమియర్ యొక్క ఆదేశాలను అమలుపరుస్తూ , లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఆ ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసింది. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించడానికి సంబంధిత పార్టీల సమన్వయంతో," అని మంత్రి పేర్కొన్నారు, కార్మికుల జీతం బకాయిలు చెల్లించడానికి నిర్మాణ సంస్థతో ఈ మేరకు ఒక కీలక aఒప్పందాన్ని చేరుకున్నట్లు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా కార్మికులకు తక్షణ నగదు చెల్లింపులు జరిగాయి, వారి బకాయిలను కొద్ది రోజులలోనే చెల్లించడానికి, కంపెనీ అంగీకరించినట్లు మంత్రి వెల్లడించారు. గత వారం (శనివారం) సనాద్ లో జరిగిన ఎస్టిక్లాల్ రహదారిపై దాదాపు వందమంది కార్మికులు 5 నెలలుగా బకాయి పడిన తమ వేతనాలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన చేసిన విషయం పాఠకులకు విదితమే కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ మహ్మద్ అలీ అల్ అన్సారీ, ఆ సమయంలో డికొన్ని రోజుల వ్యవధిలో మంత్రిత్వ శాఖ సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. బహ్రెయిన్‌లోని టాప్ కార్మిక సంఘాలలో ఒకటైన జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ కార్మికుల పెండింగ్ జీతాలను పరిష్కరించడానికి క్యాబినెట్ నిర్దేశకాలను పాటించని సంస్థను తీవ్రంగా విమర్శించింది. అదే సంస్థ నుండి వచ్చిన ఉద్యోగులు ఇదే విషయంలో మార్చిలో సైతం నిరసన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









