అజ్మాన్ లో ఆరు గిడ్డంగులు అగ్నికి ఆహుతి
- June 11, 2017
అజ్మాన్:అజ్మాన్ పారిశ్రామిక ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగి పలు గిడ్డంగులు దహనమయ్యాయి. సివిల్ డిఫెన్స్‌లో ఈ ప్రమాదానికి కారణాలు ఏవీ లేవని పేర్కొంటున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ప్లాస్టిక్ సామగ్రి కల్గి ఉన్న ఆరు గిడ్డంగులు, కర్మాగారాలు పూర్తిగా తగలబడిపోయాయి. తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు ఈ సంఘటన గూర్చి సమాచారం అగ్నిమాపకదళంకు తెలియచేయబడింది.అజ్మాన్ నుండి వచ్చిన అగ్నిమాపక దళం అగ్నిని సమర్ధవంతంగా నియంత్రించింది. అంతేకాక ప్రక్కనే ఉన్న గిడ్డంగులకు మంటలు వ్యాపించకుండా నిరోధించింది. అగ్నిమాపక సిబ్బంది మరియు అంబులెన్స్ సిబ్బందిని త్వరితగతిన అక్కడకు చేరుకోవడానికి మినహా గిడ్డంగులకు దారితీసే అన్ని రహదారులను భద్రతకు అనుగుణంగా పోలీసులు నిరోధించారు. రెస్క్యూ బృందం సమీపంలోని భవనాలను ఖాళీ చేయించింది. ఆ ప్రాంతంలో మంటలను నియంత్రణలో తీసుకొచ్చింది.ఫోరెన్సిక్ నిపుణులు అగ్ని ప్రమాదానికి అసలు కారణం కనుగొననున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









