ఇండిగో మాన్సూన్ సేల్.!
- June 12, 2017
చౌక ధరల్లో విమానటిక్కెట్లను అందించే విమానయానసంస్థ ఇండిగో మూడు రోజుల మాన్ సూన్ స్పెషల్ సేల్ ఆఫర్ ను తీసుకొచ్చేసింది. ఈ స్పెషల్ సేల్ ఆఫర్ కింద రూ.899కే టిక్కెట్ ధరను విక్రయిస్తోంది. జూన్ 12 నుంచి జూన్ 14 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఇండిగో తెలిపింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణాలకు ఈ టిక్కెట్లు వర్తిస్తాయని పేర్కొంది. ముంబై-గోవా, జమ్ము-అమృత్ సర్, ఢిల్లీ-ఉదయ్ పూర్, అహ్మదాబాద్-ముంబై, చెన్నై-పోర్టు బ్లయిర్, హైదరాబాద్-ముంబై, కోల్ కత్తా-అగర్తల, ఢిల్లీ-కోయంబత్తూర్, గోవా-చెన్నై వంటి ఎంపికచేసిన మార్గాలకు ఈ టిక్కెట్ ధరలను ఆఫర్ చేయనుంది.
అయితే ఈ స్పెషల్ ధరల ఆఫర్ ఫస్ట్-కమ్-ఫస్ట్ బేసిస్ లో అందుబాటులో ఉంచుతామని, ఒక్కసారి టిక్కెట్ బుక్ చేసుకున్నాక అవి మళ్లీ ఆ మొత్తాన్ని రీఫండ్ చేయమని ప్రకటన విడుదల చేసింది. సమ్మర్ స్పెషల్ సేల్ కు మంచి స్పందన రావడంతో, మూడు రోజుల ఈ మాన్ సూన్ సేల్ స్పెషల్ ఆఫర్ ను తీసుకొచ్చినట్టు ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు. చెన్నైతో కనెక్ట్ అయ్యే కొన్ని రూట్ల టిక్కెట్లు ఈ విధంగా ఉన్నాయి..ముంబై-చెన్నై రూ.1,999కు, ఢిల్లీ-చెన్నై కు రూ.3,399కు, బెంగళూరు-చెన్నైకు రూ.1,199కు టిక్కెట్లను అందిస్తోంది. ఈ సమ్మర్ స్పెషల్ సేల్ ను మొత్తం 39 దేశీయ మార్గాలకు అందుబాటులో ఉంచింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









