ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం ఆందోళనలతో అట్టుడికిపోతున్న డార్జిలింగ్

- June 13, 2017 , by Maagulf
ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం ఆందోళనలతో అట్టుడికిపోతున్న డార్జిలింగ్

గూర్ఖా జన్‌ముక్తి మోర్చా సభ్యులు ఉద్యమం ఉదృతం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర సాధనతో పాటు.. బెంగాలీ ఆధిపత్యం ప్రశ్నిస్తూ జరుగుతున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. అటు ప్రభుత్వ కార్యాలయాలను బలవంతంగా మూయించారన్న ఆరోపణలతో ఉద్యమకారులపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్టులు కూడా చేశారు. దీంతో ఉద్యమకారులు మరింత రెచ్చిపోతున్నారు. అటు నిరవధిక ఆందోళనలతో డార్జిలింగ్‌ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఇక్కడకు వస్తున్న పర్యాటకులు వెనుదిరుగుతున్నారు. హోటల్స్‌, రవాణా సంస్థలు మూతపడ్డాయి. ఉద్యోగులు కూడా విధులకు హాజరుకావడం లేదు. దీంతో ప్రభుత్వం వేతనాల్లో కోతలు విధిస్తామని తప్పక హాజరుకావాల్సిందేనని ఆదేశాలిచ్చింది. రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com