హైదరాబాద్,తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం
- June 18, 2017
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్తో పాటు, తెలంగాణలోని పలు జిల్లాలో వర్షం ముంచెత్తింది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్లోని ఓయూ క్యాంపస్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, లాలాపేట్, మల్లాపూర్, కాచిగూడ, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కాప్రా, రామాంతపూర్, నేరేడ్మెట్, మల్కాజిగిరి, హయత్నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ తదితర జిల్లాలో భారీ వర్షం పడుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు, గోడకూలి ఒకరు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారంలో పిడుగు పడి ఇద్దరు మృతిచెందారు. మృతులను రాజయ్య, పర్వతాలుగా గుర్తించారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం అవల్గావ్లో పిడుగుపాటుకు హనుమంత్ అనే రైతు మృతి చెందారు.మహబూబ్నగర్ జడ్చర్లలో భారీ వర్షానికి గోడకూలి ఓ మహిళ మృతిచెందింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







