భారతీయులు ప్రాణాలతో ఉన్నారని మహ్‌మూద్‌ అబ్బాస్‌ ప్రణబ్‌ముఖర్జీకి వెల్లడించారు

- October 13, 2015 , by Maagulf
భారతీయులు ప్రాణాలతో ఉన్నారని మహ్‌మూద్‌ అబ్బాస్‌ ప్రణబ్‌ముఖర్జీకి వెల్లడించారు

ఇరాక్‌లో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన 38 మంది భారతీయులు ప్రాణాలతో ఉన్నారని పాలస్తీనా అధ్యక్షుడు మహ్‌మూద్‌ అబ్బాస్‌ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వెల్లడించారు. ప్రణబ్‌ ముఖర్జీ పాలస్తీనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడితో రామల్లా నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాక్‌లో కనిపించకుండా పోయిన 38 మంది భారత జాలర్ల గురించి కూడా చర్చించారు.ఆచూకీ తెలియకుండా పోయిన భారతీయులు సురక్షితంగా ఉన్నారని చెప్పారని.. కాని ఈ విషయాన్ని బలపరిచే విధంగా ఎలాంటి ఆధారాలు చూపించలేదని పాలస్తీనాలో భారత అధికార ప్రతినిధి వెల్లడించారు. కనిపించకుండా పోయిన భారతీయులను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు బంధించి ఉంటారన్న వూహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com