రాస్ అల్ ఖైమాలో రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ళ యువకుని మృతి..అన్నకు తీవ్ర గాయాలు
- June 23, 2017
రాస్ అల్ ఖైమా: రమదాన్ పండుగ మరికొన్న రోజులలో జరుపుకోవాల్సిన ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. శృతి మించిన వేగంతో అత్యుత్సాహంగా ఓ కారులో ప్రయాణిస్తున్న ఎమిరాటీ సోదరులు ఇరువురికి పెనుప్రమాదం జరిగింది. ఈ యువకులు కారు వేగంగా నడుపుతుండగా అకస్మాత్తుగా టైర్ పేలింది. దీంతో కారు అదుపుతప్పింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్రక్కు లోకి దూసుకెళ్లింది. ఆ భారీ వాహనం, కిందపడిన కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మరణించాడు . తీవ్రంగా గాయపడిన 21 ఏళ్ల యువకుడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. చావుబతుకుల మధ్య పొరాటం చేస్తున్నాడని వైద్యులు తెలిపారు.ఈ ప్రమాదంపై రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హమీడి ఈ రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. వాహనదారులు బయలుదేరే ముందు టైర్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, వాహనం భద్రంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









