ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధులు తెలిపారు
- October 14, 2015
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో స్పైస్ జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు నడపనుంది. ఈ నెల 21, 22 తేదీలలో ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధులు బుధవారం నాడు తెలిపారు. ఢిల్లీ - విశాఖపట్నం, విశాఖపట్నం - హైదరాబాద్, ఢిల్లీ - హైదరాబాద్, హైదరాబాద్ - విజయవాడ, విజయవాడ - ఢిల్లీకి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ రూట్లలో ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతామని చెప్పింది. రాజధాని అమరావతి వేడుకను ఏపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధాని వేడుక ప్రారంభమైంది. దసరా పర్వదినం నాడు ప్రధాని మోడీ, దేశ, విదేశీ ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు నడపాలని స్పైస్ జెట్ నిర్ణయించింది. రాజధాని శంకుస్థాపన వేదిక ఏర్పాట్లను పరిశీలించిన చంద్రబాబు రాజధాని శంకుస్థాపన వేదిక ఏర్పాట్లను బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం చంద్రబాబు రాజధాని శంకుస్థాపన వేదిక ఏర్పాట్లను పరిశీలించి ఆ తర్వాత హెలికాప్టర్‌లో గన్నవరం బయలుదేరారు. ఎస్పీజీ భద్రతలోకి ఉద్దండరాయునిపాలెం: రేపే ప్రధాని రక్షక దళం రాక ఏపీ నూతన రాజధాని అమరావతికి ఈ నెల 22న విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అమరావతిలో ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) రంగంలోకి దిగనుంది. అమరావతి శంకుస్థాపన కేంద్రం ఉద్దండరాయునిపాలెం పరిసరాలను ఎస్పీజీ బృందం తన అధీనంలోకి తీసుకోనుంది. ఎస్పీజీ గురువారం ఉద్దండరాయునిపాలెం రానుంది. ప్రధాని పర్యటన ముగిసేదాకా భద్రతపై నిఘా ఉంచనుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







