అరబ్ దేశాల డిమాండ్లు సహేతుకంగా లేవు
- June 25, 2017
- అరబ్ దేశాల డిమాండ్లపై
ఖతార్ విదేశాంగ మంత్రి అల్ థానీ
- ఇది మా స్వతంత్య్ర విదేశాంగవిధానం, సార్వభౌమత్వంపై దాడి
- అయినప్పటికీ వాటిపై సమీక్ష జరుపుతున్నామని ప్రకటన
దోహా : సోదర అరబ్ దేశాల డిమాండ్లను ఖతా ర్ తోసిపుచ్చింది. తమ దేశంపై ఆంక్షల్ని ఎత్తివే యటం కోసం అరబ్ దేశాలు పెట్టిన 13 నిబంధనలు సహేతుకంగా లేవని ఖతార్ విదేశాంగ మంత్రి అబ్దు ల్ రహమాన్ అల్ థానీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తున్న కువైట్ పట్ల ఉన్న గౌరవం దృష్ట్యా, 13డిమాండ్లపై సమీక్ష జరుపుతు న్నామని, త్వరలో అధికారికంగా స్పందిస్తామని అల్ థానీ అన్నారు. ఖతార్‌పై సౌదీ అరేబియా, ఈజిప్టు, యుఏఈ, బహ్రెయిన్ దేశాలు తీవ్రమైన దౌత్యపర మైన ఆంక్షల్ని విధించిన సంగతి తెలిసిందే. సంక్షో భం సమసిపోవాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆ దేశాలు శుక్రవారం ప్రకటించాయి. అన్ని పక్షాలూ అంగీకరిస్తూ సమస్య పరిష్కారం కోసం సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సంక్షోభ నివారణకు అరబ్ దేశాలు ముందుకు కదలాలని, ఖతార్ తీసుకోదగిన చర్యల్ని డిమాండ్ చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ కొద్దిరోజుల క్రితమే సూచించారు. అరబ్ దేశాల డిమాండ్లు వాస్తవాలకు దగ్గరగా ఉం డాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి కూడా అభిప్రాయ పడ్డారు. అయితే వారు సూచించినట్టుగా అరబ్ దేశాల డిమాండ్లు లేవని అల్ థానీ విమర్శించారు. తమపై ఆంక్షలు విధించటం ద్వారా తీవ్రవాదాన్ని దెబ్బకొట్టలేరని, తమ దేశ సార్వభౌమత్వంపై, స్వతం త్ర విదేశాంగ విధానంపై దాడి జరుపుతున్నారని 'అల్ జజీరా' మీడియాతో అల్ థానీ చెప్పారు. ఖతార్ పై అరబ్ దేశాలు ప్రకటించిన ఆంక్షలు అమల్లోకి వచ్చి రెండువారాలు దాటింది. రోడ్డు, విమాన సర్వీసుల్ని సౌదీ అరేబియా పూర్తిగా నిలిపివేసింది. అలాగే సోదర అరబ్ దేశాల నుంచి కూడా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకున్నారు. దోహా కేంద్రంగా ఖతార్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన 'అల్ జజీరా' టీవీ ప్రసారాల్ని వెంటనే నిలిపివేయాలని కూడా అరబ్ దేశాలు డిమాండ్ చేశాయి. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఖతార్ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు లోనైంది.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్‌ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి