మొహర్రం సంతాప దినాలు ప్రారంభమయ్యాయి

- October 14, 2015 , by Maagulf
మొహర్రం సంతాప దినాలు ప్రారంభమయ్యాయి

నెలవంక కనిపించడంతో మొహర్రం సంతాప దినాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గురువారం ఆషూర్‌ఖానాల్లో ఆలంల(పీరీలు)ను ప్రతిష్టిస్తారు. ఈ నెల 24వ తేదీన మొహర్రం బీబీకా అలావా నుంచి బీబీకా ఆలంను ఏనుగు ఆంబారీపై ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ మేరకు నగరంలోని ఆషూర్‌ఖానాల్లో యుద్ధ్దప్రాదిపతిక పనులు పూర్తి చేశారు. ఆషుర్‌ఖానాల నిర్వహణకు రూ. 12 లక్షలు.. ఈ ఏడాది మొహర్రం సంతాప దినాల్లో భాగంగా నగరంలోని దాదాపు 161 ఆషుర్‌ఖానాలు, అంజుమన్ల నిర్వహణ, నీటి సరఫరా కోసం రూ. 12 లక్షలు విడుదల చేసినట్లు బుధవారం నాంపల్లి హజ్ హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వక్ఫ్‌బోర్డు సీఈఓ అసదుల్లా చెప్పారు. ఏటా మొహర్రం నెలలోని మొదటి 19 రోజులు ముస్లింలు సంతాప దినాలుగా పాటించి, ఆషూర్‌ఖానాల్లో ఆలంల(పీరీలు)ను ప్రతిష్టించి, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు. ఆషూర్‌ఖానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో మొహర్రం ఏర్పాట్లపై సమీక్షించి, తమ సిబ్బందికి బాధ్యతలు ఇచ్చారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com