ఖతార్‌ హాస్పిటాలిటీ ఎగ్జిబిషన్‌

- October 14, 2015 , by Maagulf
ఖతార్‌ హాస్పిటాలిటీ ఎగ్జిబిషన్‌

12 దేశాలకు చెందిన 111 మంది ఎగ్జిబిటర్స్‌ 'హాస్పిటాలిటీ ఖతార్‌ 2015'లో పాలుపంచుకున్నారు. ఖతార్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఎకానమీ మరియు కామర్స్‌, షేక్‌ అహ్మద్‌ బిన్‌ జాసిమ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ థానీ ఈ ఎగ్జిబిషన్‌ని దోహాలో ప్రారంభించారు. ఖతార్‌ మినిస్టర్‌ ఆఫ్‌ కల్చర్‌ ఆర్ట్స్‌ మరియు హెరిటేజ్‌ మంత్రి డాక్టర్‌ హమాద్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ కువారి, సీనియర్‌ ప్రభుత్వ అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఖతార్‌ టూరిజం ద్వారా లైసెన్స్‌ పొందిన ఈ ఎగ్జిబిషన్‌ అక్టోబర్‌ 15 వరకూ ఉంటుంది. ఖతార్‌, యూఏఈ, కువైట్‌, ఈజిప్ట్‌, చైనా, జర్మనీ, ఇండియా, ఇటలీ, జోర్డాన్‌, లెబనాన్‌, రొమేనియా, లూథియానా తదితర దేశాలకు చెందిన హాస్పిటాలిటీ సంస్థలు 10 వేల మంది విజిటర్స్‌ని ఆకర్షించేలా 5 వేల చదరపు మీటర్ల ఎగ్జిబిషన్‌ ప్లేస్‌లో తమ తమ స్టాల్స్‌ని ఏర్పాటు చేశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com