50 ఏళ్లు దాటిన పురుషులు తీసుకోవాల్సిన ఆహారం

- October 14, 2015 , by Maagulf
50 ఏళ్లు దాటిన పురుషులు తీసుకోవాల్సిన ఆహారం

హాఫ్ సెంచరీ కొట్టేశారా ? అదేనండీ మీ వయసు 5 పదులు దాటిందా ? అయితే.. ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ వహించాల్సిందే. ఇప్పటిదాకా.. ఏం తిన్నా.. ఎలా తిన్నా.. ఇకపై మాత్రం మీ వయసుకు తగ్గట్టు.. శరీరానికి ప్రయోజనాలు చేకూర్చే ఫుడ్ తీసుకుంటే.. మంచిది. 50 ఏళ్లలో అడుగుపెట్టారంటే.. ఆరో్గ్యంపై జాగ్రత్త వహించాలి. తీసుకునే ఆహారంలో పోషక విలువలు, విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్ లో చేర్చుకుంటే.. మరో 50 ఏళ్లు ఆయురారోగ్యాలతో బతికేయచ్చు.  న్యూట్రీషియస్ ఫుడ్ అంటే అందరూ ముందుగా సూచించేది పండ్లు. తాజా పండ్లలో శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. సీజన్వారీగా అందుబాటులో ఉండే పండ్లు తీసుకుంటూ ఉండాలి. హాఫ్ సెంచరీ దాటిన పురుషులు.. ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. అందులో భాగంగా.. వీళ్లు చేపలని వారానికి రెండుసార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాల్మన్, ట్యూనా, హలిబుట్ వంటి చేపలతోపాటు సీ ఫుడ్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని రకాల పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి పండ్ల రసాలు తీసుకునేటప్పుడు వాటికి పంచదార ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే లేటు వయసులో మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువుంటాయి. ఫ్రూట్ జ్యూస్ లు తరచుగా తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఐదు పదుల వయసులో శరీరానికి క్యాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి ఈ రెండు శరీరానికి అందేలా చూసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండే బ్రొకోలి, ఆకుకూరలు, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి. లేటు వయసులో బీపీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బీపీ పెరిగితే.. గుండె నొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. బ్రౌన్ రైస్ ఈ వయసులో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతాయి. తాజా కూరగాయలు తీసుకోవాలి. ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరానికి ఫైబర్ అందుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com