డ్రగ్‌ అబ్యూస్‌, ఇలిసిట్‌ ట్రాఫికింగ్‌ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించిన అబుధాబి

- June 27, 2017 , by Maagulf
డ్రగ్‌ అబ్యూస్‌, ఇలిసిట్‌ ట్రాఫికింగ్‌ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించిన అబుధాబి

అబుధాబి: అబుధాబి పోలీసులు, ఇంటర్నేషనల్‌ డే ఎగైనెస్ట్‌ డ్రగ్‌ ఎబ్యూస్‌ అండ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫికింగ్‌ని రేపు నిర్వహించనున్నారు. ప్రతియేడాదీ జూన్‌ 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 'లిజన్‌ ఫస్ట్‌' అనే కాన్సెప్ట్‌ని యునైటెడ్‌ నేషన్‌ ఆఫీస్‌ ద్వారా ఈ ఏడాది చేపడుతున్నారు. అబుదాబీ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ ఖల్ఫాన్‌ అల్‌ రుమైతి మాట్లాడుతూ, సమాజంలో డ్రగ్‌ ఎబ్యూజ్‌, ఇల్లిసిట్‌ ట్రాఫికింగ్‌కి చోటు లేదనీ, అభివృద్ధికి ఈ రెండూ నిరోధకాలుగా పనిచేస్తాయని అన్నారు. వీటిని అడ్డుకోవడానికి అబుధాబి పోలీసులు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తూ, అత్యాధునిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తున్నట్లు చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com