ఏఆర్ రెహమాన్ జీవితకథ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ
- October 15, 2015
భారతీయ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన ఏఆర్ రెహమాన్ జీవితకథ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. 90 నిమిషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ అక్టోబర్ 26న డిస్కవరీ చానల్ లో ప్రసారం కానుంది. తన జీవితకథను తెరకెక్కించడానికి రెహమాన్ ఒప్పుకోకపోయినా ప్రముఖ ఫిలిం మేకర్ ఉమేష్ అగర్వాల్ ఒత్తిడితో అంగీకరించాడు. అంతర్జాతీ స్ధాయిలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఫిలింలో రెహమాన్ ఇంటర్వ్యూతో పాటు, అమీర్ ఖాన్, డానీ బోయల్, మణిరత్నం, గుల్జార్, అశుతోష్ గోవరీకర్, శేఖర్ కపూర్ లాంటి సెలబ్రిటీలు రెహమాన్ గురించి చెప్పిన మాటలను టెలికాస్ట్ చేయనున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో రెహమాన్ ఎదుర్కొన్న కష్టాలు, ఆ తరువాత దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అతి కొద్ది కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకోవటం, బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్, అంతర్జాతీయ సినిమాలకు సంగీతం అందించటం లాంటి అంశాలతో పాటు ఆస్కార్ వేదికపై రెహమాన్ చెప్పిన మాటలను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







