షార్జాలో ట్యాక్సీ ఫేర్‌లు పెరగనున్నాయి

- October 15, 2015 , by Maagulf
షార్జాలో ట్యాక్సీ ఫేర్‌లు పెరగనున్నాయి

షార్జాలో ఇక నుంచి ఫేర్‌లు పెరగనున్నాయి. 10 దిర్హామ్‌లనుంచి 11.50 దిర్హామ్‌లకు మినిమమ్‌ ట్యాక్సీ ఫేర్‌ పెరిగింది. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ట్యాక్సీ ఫేర్‌లు పెంచవలసి వచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే పెంచిన ధరలతోనూ తమకు నష్టాలు తప్పడంలేదని ట్యాక్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రయాణీకులు మాత్రం పెరిగిన ధరల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల ధరలూ పెరుగుతుండడంతో జీవనం కష్టమవుతోందని ప్రయాణీకులు చెప్పారు. మినిమమ్‌ ఛార్జీల్లో మార్పులున్నా, తదనంతరం చెల్లించాల్సిన ధరల్లో పెద్దగా మార్పులు చేయలేదు. మినిమమ్‌ ఛార్జి తర్వాత ప్రతి పాయింట్‌కీ 3.5 దిర్హామ్‌లు పగలు, 4 దిర్హామ్‌లు రాత్రి పూట పాత పద్ధతిలోనే ప్రయాణీకులు, ట్యాక్సీలకు చల్లించవలసి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com