మొదటి వారంలో కరీంనగరానికి సీఎం కేసీఆర్

- June 29, 2017 , by Maagulf
మొదటి వారంలో కరీంనగరానికి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌రాకకు కరీంనగరం ముస్తాబతోంది. హరితహారం, పలు అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనలు చేసేందుకు జూలై మొదటి వారంలో జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ మేరకు అధికారులు, నాయకులు నగరంలో వీధులు అందంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ముఖ్య కూడళ్లలో మొక్కలు నాటుతున్నారు. బస్టాండ్‌, గీతాభవన్‌, కోర్టు, కమాన్‌ చౌరస్తాల్లో పచ్చదనాన్ని నింపుతున్నారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రధాన రహదారుల మధ్యలో మట్టి నింపుతున్నారు. ఇందులో మొక్కలు నాటే పనిలో పడ్డారు. ప్రభుత్వ ప్రహారీ గోడలకు తెలంగాణ కళాకృతులు ఉట్టిపడేలా పేయింటింగ్‌ వేయిస్తున్నారు. అనుమతి లేకుండా పోస్టర్లు అంటిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్‌ శశాంక ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. స్మార్ట్‌సిటీగా ఎంపికైన నేపథ్యంలో కొత్త ఉత్సాహంలో పాలకవర్గం పనిచేస్తున్నట్టు స్పష్టమవుతోంది. హరితహారం పథకం కరీంనగర్‌ నుంచే ప్రారంభిస్తానని, ఒకే రోజు లక్ష మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో నగరపాలక సంస్థనే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తున్నారు. అందులో పోలీసు శాఖ నగరంలోని పది డివిజన్లను దత్తత తీసుకుంది.

స్వయంగా పోలీసు కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి పలు డివిజన్లలో పర్యటించి మొక్కలు నాటే అనువైన స్థలాలను గుర్తించారు. పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. నగరానికి వరాలు కురిపించి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రాకకు మేయర్‌, పాలక వర్గం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com