ప్రముఖ హాస్య నటుడు ఫృథ్వికి కోర్టు దిమ్మతిరిగే షాక్!
- June 29, 2017
ప్రముఖ హాస్య నటుడు పృద్వీరాజ్ కు కోర్టు పెద్ద భాద్యతే పెట్టింది. ఆయన తన భార్యకు నెలకు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని వివజయవాడ కుటుంబ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.పృద్వీరాజ్ కు విజయవాడ అరండల్ పేటకు చెందిన శ్రీలక్మితో 1984 లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం పాటు వీరిద్దరు స్వీట్ షాప్ నడిపారు.ఆ దశలో పృద్వీరాజ్ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు మకాం మార్చారు.ఆ తరవ్ఆత వీరిద్దరికి గొడవలు వచ్చాయి. పృద్వీరాజ్ వ్యసనాలకు అలవాటు పడ్డారని అభియోగం.వీరిమద్య రాజీయత్నాలు కూడా ఫలించలేదు.దాంతో శ్రీలక్మీ విజయవాడకు వచ్చేశారు.ఆ తర్వాత ఏ ప్రయత్నానికి పృద్వీరాజ్ అంగీకరించకపోవడంతో అతనిపై ఆమె కేసు పెట్టారు.తన జీవనోపాది నిమిత్తం నెలకు పది లక్షల రూపాయలు ఇప్పించాలని ఆమె కోరారు.ఈ కేసును విచారణ చేసిన కోర్టు,వాయిదాలకు కూడా పృద్వీరాజ్ రాకపోవడంతో శ్రీలక్మికి ఎనిమిది లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు. ఆయన అంత ఇవ్వగలుగుతారో ,లేదో కాని, కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో అలాంటి ఆదేశాలు వచ్చాయని అనుకోవచ్చేమో!
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







