నయనతార లవ్ స్టోరీలో.. కొత్త ట్విస్టు !

- June 29, 2017 , by Maagulf
నయనతార లవ్ స్టోరీలో.. కొత్త ట్విస్టు !

స్టార్ హీరోయిన్ నయన తార దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ రెండేళ్లు పూర్తి చేసుకొంది. విజయంతంగా మూడో యేడాదిలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇంతలోనే కొత్త ట్విస్టు వచ్చిపడింది. ప్రియుడు విఘ్నేష్ నయన్ ని పెళ్లాడెందుకు ఆసక్తిని చూపడం లేడు. కొన్నాళ్ల పాటు ఇలాగే ఎంజాయ్ చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారట. ప్రస్తుతం దృష్టంతా కెరీర్ పైనే.. ఆ తర్వాత పెళ్లిని చెబుతున్నాడు విఘ్నేష్.
నయన్ కూడా ప్రియుడు అభిప్రాయానికి సపోర్ట్ తెలిపింది. ఇద్దరి మధ్య దాదాపు అన్ని ముచ్చట్లు తీరిపోయాయి. ఇద్దరికీ షూటింగులు లేనపుడు కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని, సీక్రెట్‌గా హాలిడే ట్రిప్పులు ఎంజాయ్ చేస్తున్ననట్టు సమాచారమ్. అన్నీ తీరిపోతుంటే పెళ్లి ఆలోచన ఎందుకు వస్తుందనే గుసగుసలు వినబడుతున్నాయి. అయితే, అంతా బాగానే ఉన్నా.. గతంలో రెండు లవ్ స్టోరీలు బెడిసికొట్టడంతో.. విఘ్నేష్ విషయంలోనూ నయన్ లోలోన మదన పడుతున్నట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com