సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- February 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అవినీతి ఆరోపణలపై 127 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది. గత జనవరి నెలలో నిర్వహించిన 1,543 స్పాట్ తనఖీల సందర్భంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలలో సమగ్రతను ప్రోత్సహించడానికి మరియు అవినీతిని ఎదుర్కోవడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా 383 మంది ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.
కాగా, అరెస్టు అయిన వారిలో కొందరిని బెయిల్‌పై ఇప్పటికే విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఉద్యోగులు రక్షణ మంత్రిత్వ శాఖ, అంతర్గత మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







