ఫేస్‌బుక్‌ లో కొత్త ఫీచర్‌

- July 01, 2017 , by Maagulf
ఫేస్‌బుక్‌ లో కొత్త ఫీచర్‌

సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ ఆ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదేనండి ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా ఉచిత వైఫై సదుపాయం ఎక్కడ ఉందో ఎంచక్కా మీకు ఫేస్‌బుకే చెప్పేస్తోంది. దీని ద్వారా ఉచిత వైఫైను యూజర్లు వాడుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్‌ ఎంపికచేసిన దేశాల్లో కేవలం ఐఓఎస్‌ మొబైల్‌ యూజర్లకు గతేడాది నుంచి అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అంటే ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లందరికీ  అందించడం ప్రారంభించింది ఫేస్‌బుక్‌.
 
తాము దీన్ని గతేడాది కొన్ని దేశాల్లో మాత్రమే లాంచ్‌ చేశామని, కేవలం ప్రయాణాలు చేసే వారికోసం మాత్రమే కాకుండా, డేటా అయిపోతుందని భయపడేవారి కోసం కూడా ఇక దీన్ని విస్తరిస్తున్నామని ఫేస్‌బుక్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ అలెక్స్‌ హిమెల్‌ చెప్పారు. '' ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఎక్కడెక్కడ వైఫై హాట్‌ స్పాట్లు ఉన్నాయో సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. డేటా కనెక్షన్‌ బలహీనంగా ఉన్నప్పుడు వెంటనే దగ్గర్లోని ఉచిత వైఫై కనెక్షన్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని అలెక్స్‌పేర్కొన్నారు. ఫైండ్‌ వైఫై హాట్‌స్పాట్ల కోసం ఫేస్‌బుక్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, ''మోర్‌'' ట్యాబ్‌ను క్లిక్‌చేస్తే, ''ఫైన్డ్ వైఫై''ఫీచర్‌ కనిపిస్తోంది. ఇక దాన్ని ఆన్‌ చేసుకుంటే చాలు, మ్యాప్‌లో దగ్గర్లోని హాట్‌స్పాట్లను యూజర్లు వాడుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com