ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!

- January 27, 2026 , by Maagulf
ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!

దోహా: ఖతార్ లో ఫుడ్ ఫెస్టివల్ 2026 సందర్శకులను ఆకట్టుకున్నది. 974 స్టేడియం ప్రెసింక్ట్‌లో 10 రోజుల్లో 490,493 మంది సందర్శకులు సందర్శించారు. ఖతార్ అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్ (QIFF) విజయవంతంగా ముగిసింది. ఇది ఫెస్టివల్ చరిత్రలో అత్యధికంగా హాజరైన ఎడిషన్‌గా గుర్తింపు పొందింది.  ఈ సంవత్సరం ఎడిషన్ మునుపటి సంవత్సరంతో పోలిస్తే మొత్తం హాజరులో 36% పెరుగుదలను నమోదు చేసింది. అంతర్జాతీయ సందర్శకులు మొత్తం సందర్శకులలో 10% ఉన్నారు. ఖతార్ జాతీయులు అత్యధికంగా 22.1% మంది హాజరయ్యారు. అయితే 32% మంది సందర్శకులు మళ్లీ మళ్లీ వచ్చారు.  
QIFF 2026లో 200 మంది స్థానిక విక్రేతలు పాల్గొన్నారు. 46 మంది అంతర్జాతీయ విక్రేతలతో పాటు మునుపటి ఎడిషన్ కంటే 43% పెరుగుదలను నమోదు చేసింది. ఈ సంవత్సరం మొదటిసారిగా  QIFF అవార్డులను కూడా ఆవిష్కరించింది. హుకీస్ కుకీస్ లాంగెస్ట్ లైన్ అవార్డును అందుకుంది. ఐబిస్ దోహా ఫేవరెట్ లోకల్ వెండర్‌గా, 99 గ్రిల్ ఫేవరెట్ ఇంటర్నేషనల్ వెండర్‌గా, టాకో కింగ్ ఫేవరెట్ చెఫ్‌గా ఎంపికయ్యారు. ఖతార్ ఫుడ్ ఫెస్టివల్ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా షకర్జీకి గౌరవ అవార్డును ప్రదానం చేసినట్టు విజిట్ ఖతార్‌లోని ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్ డైరెక్టర్ అహ్మద్ హమద్ అల్ బినా తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com