హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్.. టాలీవుడ్ బడాబాబుల హాస్తం..

- July 02, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్.. టాలీవుడ్ బడాబాబుల హాస్తం..

హైదరాబాద్‌ యూత్‌ మత్తుకు చిత్తవుతోంది. మొన్నటి వరకు యూత్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్‌... ఇప్పుడు స్కూల్‌ పిల్లలకు కిక్కిస్తోంది. హైదరాబాద్‌లో ఈ డ్రగ్స్‌ ముఠాకు పోలీసులు చెక్‌ పెట్టడంతో... దిమ్మ తిరిగే విషయాలు బయపటపడ్డాయి. ఈ గ్యాంగ్‌ చెప్పే ఒక్కో నిజం విని పోలీసులే షాకయ్యారు. ఈ మాఫియా వలలో బడా, బడా వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. స్కూల్‌ విద్యార్థులే టార్గెట్‌గా ఈ ముఠా దందా చేసినట్లు తేలింది. నగరంలోని చాలా స్కూళ్లలో ఈ దందా మూడు పూలు, ఆరు కాయల్లా సాగుతోంది. 
పక్కా సమాచారంతో హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో  ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోదాలు చేశారు. ముగ్గుర్ని అరెస్ట్‌ చేసి 22 లక్షల విలువచేసే డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. ఈ మత్తు పదార్థాల్లో 700 గ్రాముల ఎల్‌ఎస్‌డీ డాట్స్‌, బ్లాట్స్‌, 35 గ్రాముల ఎండీఎంఏలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని ప్రశ్నిసున్న పోలీసులు... ఈ దందా వెనుక ఎవరున్నారు? డ్రగ్స్‌ మత్తులో ఊగుతున్నదెవరో తేల్చే పనిలో ఉన్నారు. 
అరెస్ట్‌ చేసిన వారిలో కెల్విన్‌ మెకనాస్‌, మహ్మద్‌ ఖుద్దూస్‌ కీలక నిందితులు. వీరు డ్రగ్స్‌ సరఫరా కోసం టెక్నాలజీని ఉపయోగించారు. తమ కస్టమర్లకు సరుకు ఇస్తామో ఎస్‌ఎంఎస్‌ చేసే స్మగ్లర్లు... తాము పంపిన మేసేజ్‌ పది నిమిషాల్లో అవతలి వారి ఫోన్‌ నుంచి డిలీట్‌ అయిపోయేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. వాట్సాప్‌, ఇంటర్నెట్‌ ఫోన్‌ కాల్స్‌ ద్వారా మంతనాలు సాగించేవారు. నిందితుల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ల నుంచి పోలీసులు డేటా సేకరించారు. పోలీసులు సోదాల సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com