హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్.. టాలీవుడ్ బడాబాబుల హాస్తం..
- July 02, 2017
హైదరాబాద్ యూత్ మత్తుకు చిత్తవుతోంది. మొన్నటి వరకు యూత్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్... ఇప్పుడు స్కూల్ పిల్లలకు కిక్కిస్తోంది. హైదరాబాద్‌లో ఈ డ్రగ్స్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టడంతో... దిమ్మ తిరిగే విషయాలు బయపటపడ్డాయి. ఈ గ్యాంగ్ చెప్పే ఒక్కో నిజం విని పోలీసులే షాకయ్యారు. ఈ మాఫియా వలలో బడా, బడా వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. స్కూల్ విద్యార్థులే టార్గెట్‌గా ఈ ముఠా దందా చేసినట్లు తేలింది. నగరంలోని చాలా స్కూళ్లలో ఈ దందా మూడు పూలు, ఆరు కాయల్లా సాగుతోంది.
పక్కా సమాచారంతో హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి 22 లక్షల విలువచేసే డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ మత్తు పదార్థాల్లో 700 గ్రాముల ఎల్ఎస్డీ డాట్స్, బ్లాట్స్, 35 గ్రాముల ఎండీఎంఏలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని ప్రశ్నిసున్న పోలీసులు... ఈ దందా వెనుక ఎవరున్నారు? డ్రగ్స్ మత్తులో ఊగుతున్నదెవరో తేల్చే పనిలో ఉన్నారు.
అరెస్ట్ చేసిన వారిలో కెల్విన్ మెకనాస్, మహ్మద్ ఖుద్దూస్ కీలక నిందితులు. వీరు డ్రగ్స్ సరఫరా కోసం టెక్నాలజీని ఉపయోగించారు. తమ కస్టమర్లకు సరుకు ఇస్తామో ఎస్ఎంఎస్ చేసే స్మగ్లర్లు... తాము పంపిన మేసేజ్ పది నిమిషాల్లో అవతలి వారి ఫోన్ నుంచి డిలీట్ అయిపోయేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. వాట్సాప్, ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ ద్వారా మంతనాలు సాగించేవారు. నిందితుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల నుంచి పోలీసులు డేటా సేకరించారు. పోలీసులు సోదాల సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







